ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఆధ్వర్యంలో జరగబోతున్న “గ్లోబ్ ట్రోటర్” (Globetrotter) ఈవెంట్ కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నవంబర్ 15న జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమంపై అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి తన అధికారిక X ఖాతా ద్వారా పాల్గొనేవారికి కొన్ని కీలక సూచనలు చేశారు. అయన ట్వీట్‌లో పేర్కొంటూ.. “నవంబర్ 15న జరిగే గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా ఉంది. ఎవ్వరికీ ఇబ్బంది…