ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించబోతున్నారు.. తూర్పు గోదావరి జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాలో ప్రధాని ప్రచారం కొనసాగనుంది.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి రానున్నారు ప్రధాని మోడీ.. మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి వేమగిరి సెంటర్‌లో నిర్వహించనున్న ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.. అనంతరం విశాఖ జిల్లా అనకాపల్లి బయలుదేరి వెళ్తారు.. ప్రధాని మోడీ బహిరంగ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు..