బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, ఎద్దులను కోయకుండా సీఎం, డీజీపీ చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. పండుగ ఎలా జరుపుకుంటారో తమకు అనవసరమని.. కానీ పశువులను కోస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే తాము బాధ్యులం కాదని తేల్చిచెప్పారు. పశువుల రవాణాలో సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయాలని సూచించారు.