టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సమగ్రంగా దర్యప్తు చేస్తున్న సిట్ కు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. మొత్తం 9 మందిని వేరు వేరు ప్రదేశాల్లో తీసుకువెళ్లి విచారిస్తున్న సిట్ కు రోజుకో ట్విస్ట్ ఎదురవుతుంది. వరుసగా నాలుగు రోజుల విచారణ జరిపిన సిట్ ఇవాళ 5వ రోజుకు చేరింది. సిట్ వేగం పెంచడంతో ఉత్కంఠ నెలకొంది.