మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ రాష్ట్రానికి చెందిన రాజ్ కుమార్ పాండాతో పాటు మరో ఇద్దరి అరెస్ట్ చేయగా.. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో గత జనవరిలో చోరీ జరిగింది. ఫిల్మ్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..