రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అను సంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం 'రైతు నేస్తం'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ప్రారంభించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో రైతు వేదికను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 2,603 రైతు వేదికలను దేశంలో ఎక్కడాలేని విధంగా నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు. రైతులను సంఘటితం చేసి, తద్వారా వచ్చే లాభాన్ని తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో 6…