జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ‘రైతు భరోసా యాత్ర’ చేపట్టినప్పటి నుంచి.. ఆంధ్ర రాజకీయాలు వ్యవసాయ రంగం చుట్టూ తిరుగుతున్నాయి. అధికార, టీడీపీ పార్టీలు సైతం.. ఈ సందర్భంగా కార్యక్రమాలు, కమిటీల్ని నిర్వహిస్తున్నాయి. తాజాగా టీడీపీ ‘రైతు కోసం తెలుగుదేశం’ పేరిట ఓ కమిటీని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జగన్ మూడేళ్ళ పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని,…