AP Weather: ఆంధ్రప్రదేశ్‌లో ఓ వైపు వర్షాలు.. మరోవైపు ఎండలు దంచికొడుతున్నాయి.. కొన్ని చోట్ల గరిష్టస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా.. మరికొన్ని చోట్ల భారీ వర్షం.. కొన్ని చోట్ల మోస్తరు వానలు.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన.. ఇలా విభిన్నమైన పరిస్థితులు ఉన్నాయి.. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. వాతావరణ అనిశ్చితి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..
Read Also: TTD : తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ సిఫార్సు లేఖల కోసం ప్రత్యేక పోర్టల్
ఇక, రేపు అంటే శనివారం రోజు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఆదివారం ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.. సోమవారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
Read Also: TTD : తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ సిఫార్సు లేఖల కోసం ప్రత్యేక పోర్టల్
మరోవైపు.. గురువారం ఉదయం 8.30 నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటల మధ్య రాష్ట్రంలోని 12 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా.. 23 ప్రాంతాల్లో 50 మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని వెల్లడించారు. అత్యధికంగా నంద్యాల జిల్లా మద్దూరు, ప్రకాశం జిల్లా రాళ్లపల్లిలో 111.5 మిమీ, వైఎస్సార్ జిల్లా కలసపాడులో 110.7 మిమీ, నంద్యాల జిల్లా పెరుసోమలలో 107మిమీ, శ్రీసత్యసాయి జిల్లా కొండకోమర్లలో 101 మిమీ చొప్పున వర్షపాతం నమోదు అయ్యిందన్నారు.. ఇదే సమయంలో.. ఈ రోజు పార్వతీపురంమన్యం జిల్లా జియ్యమ్మవలసలో 39.9 డిగ్రీ ఉష్ణోగ్రత, తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 39.2, శ్రీకాకుళం జిల్లా కొల్లివలసలో 39.1, కాకినాడ జిల్లా జగ్గంపేట, విజయనగరం జిల్లా గుర్లలో 38.9, అనకాపల్లి జిల్లా బలిఘట్టంలో 38.8 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.