బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పనపీడనం ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతంలో ప్రజలు సముద్రంలోకి వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి.