ఉత్తర భారతదేశంలో కుండపోత వర్షాలు కొనసాగుతుండటంతో భారీ వర్షాలు, వరద సంబంధిత సంఘటనలలో 100 మందికి పైగా మరణించారు. గత వారం వర్షం ప్రారంభమైనప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోనే దాదాపు 80 మంది మరణించారు.
రానున్న మూడు రోజుల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ హిమాలయ ప్రాంతం, మధ్యప్రదేశ్‌లో మే 3 వరకు భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
Heavy rains and floods in Odisha: ఒడిశా రాష్ట్రం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలతో అల్లాడుతోంది. ఒడిశాతో పాటు జార్ఖండ్, మధ్యప్రదేశ్ లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం కారణంగా ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా బాలాసోర్, మయూర్ భంజ్ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను తరలిస్తున్నారు. ఈ ప్రాంతం గుండా వైతరణి, సువర్ణ రేఖ నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందికి సంబంధించిన 58…