టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా నివాసంలో విషాదం నెలకొంది. రైనా తండ్రి త్రిలోక్‌చంద్ రైనా ఆదివారం ఘాజియాబాద్‌లోని స్వగృహంలో మరణించారు. కొన్నిరోజులుగా ఆయన క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. త్రిలోక్ చంద్ గతంలో మిలటరీ అధికారిగా పనిచేశారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో బాంబులు తయారు చేయడంలో ఆయన దిట్ట. ఆయన పూర్వీకులది జమ్ముకాశ్మీర్లోని రైనావరి గ్రామం. 1990లలో కశ్మీరీ పండిట్ల హత్యల ఘటన అనంతరం ఆ గ్రామాన్ని విడిచిపెట్టారు. అనంతరం యూపీలోని మురాద్నగర్లో స్థిరపడ్డారు. Read Also: లతా మంగేష్కర్‌కు…