T20 World Cup: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే గ్రూప్-2లో దక్షిణాఫ్రికా-జింబాబ్వే మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. తాజాగా గ్రూప్-1లో న్యూజిలాండ్-ఆప్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. ఒక్క బాల్ కూడా పడకుండానే అంపైర్లు ఈ మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఈ మెగా టోర్నీలో వరుణుడి ఖాతాలో రెండు మ్యాచ్‌లు చేరాయి. ఇప్పటివరకు టోర్నీలో సూపర్-12…