రానున్న మూడు రోజుల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ హిమాలయ ప్రాంతం, మధ్యప్రదేశ్‌లో మే 3 వరకు భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ లో గెలిచిన టీమిండియా ఇప్పుడు రెండో మ్యాచ్ పై ఫోకస్ చేసింది. తొలి వన్డే ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగగా.. రెండో వన్డే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికగా జరగనుంది.
ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నారు. మరో రెండు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్‌లో మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఇవాళ ఉదయం నుంచి కురిసిన వర్షానికి నగరవాసులు తడిసిముద్దయ్యారు. భారీ వర్షం వల్ల రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు రావడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని ఉన్న ఈ తీవ్ర అల్పపీడనం.. రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణా రాష్ట్రంలో రాగల రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒరిస్సా తీరం దాటి పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం ఈ రోజు వాయువ్య బంగాళాఖాతంలోని ఒరిస్సా, పశ్చిమబెంగాల్ తీరంలో కొనసాగుతూ వుంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్రమట్టం నుండి 7.6కిమీ వరకు విస్తరించి వున్నందున నేడు, రేపు రాష్ట్రంలో.. తేలికపాటి నుండి మోస్తరు వానలు పడే అవకావం వుందని పేర్కొంది. ఈనేపథ్యంలో.. తెలంగాణ…
భారత దేశ రైతాంగానికి శుభవార్త.. ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. భారత్‌లోకి ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి.., అండమాన్‌ను తాకాయి నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో మరింత చురుకుగా కదులుతోన్న నైరుతి రుతుపవనాలు.. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవులకు పూర్తిగా విస్తరించినట్టు ఐఎండీ ప్రకటించింది.. దీంతో, 23 రోజుల ముందుగానే రుతుపవనాలు ప్రారంభమయ్యాయని వెల్లడించింది ఐఎండీ. Read Also: Bandi Sanjay: నాగరాజు కుటుంబానికి పరామర్శ.. హత్య వెనుక పెద్ద కుట్ర..! ఇక, నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్‌తో…
తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. ఉమ్మడి ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.. మరోవైపు.. హైదరాబాద్ సహా మరికొన్ని జిల్లాల్లో వాతావరణం మారిపోయింది.. వర్షాలు కురుస్తున్నాయి.. ఎండలు, ఒక్కపోత నుంచి ఉపశమనం కలిగిస్తూ.. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, ఇవాళ, రేపు కూడా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.…