Cyclone Fengal: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ తీరం దాటిందని భారత వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కాగా, ఈ రోజు (డిసెంబర్ 2) తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
నైరుతి బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలో మీటర్ల వేగంతో కదులుతూ తీవ్రవాయుగుండంగా రూపాంతరం చెందినట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.. ప్రస్తుతానికి ట్రింకోమలీకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో, నాగపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 590 కిలో మీటర్లు, పుదుచ్చేరికి దక్షిణ-ఆగ్నేయంగా 710 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ-ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనన తీవ్ర వాయుగుండం..
గంగానది పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉన్న లోతైన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని వలన భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Heavy Rain: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాల వర్షాలు కురుస్తున్నాయి.
ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్‌లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్ష సూచనలు ఉన్నాయని పేర్కొంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు, దక్షిణ ఒడిశాతో పాటు తెలంగాణ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ఝార్ఖండ్ పరిసర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ద్రోణి ప్రభావంతో రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...బుధ, గురువారాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
Telangana Rains: హైదరాబాద్ నగరమంతటా మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. చాలా చోట్ల వర్షం మొదలైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.