వరంగల్ జిల్లాలో ఘోర ఘటన చోటు చేసుకుంది. పెళ్లి నిశ్చయమై.. తెల్లారితే నిశ్చితార్థం అనగా మృత్యువు ఊహించని విధంగా వర్షాల రూపంలో ఆ యువకున్ని మింగేసింది. ఈ ప్రమాదంలో యువకుడితో పాటు మరో వ్యక్తి మృతి చెందగా.. తల్లికి తీవ్రగాయాలయ్యాయి. భారీ వర్షాల కారణంగా వరంగల్‌లోని మండి బజారులో ఓ పాత భవనం కూలడంతో..ఇద్దరు మృతి చెందారు. వరంగల్ నగరంలోని మండి బజార్ మెయిన్ రోడ్ లో గ్రాంపాస్ బేకరీ పురాతనమైన బిల్డింగ్ కూలి పక్కనే ఉన్న…