Trains Cancelled :రైల్వే ప్రయాణికులు అప్రమత్తం కావాల్సిన సమయం.. ఎందుకంటే.. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా నిన్నటి నుంచి అంటే ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు.. మూడు రోజుల పాటు.. కొన్ని రైళ్లు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఇవాళ విజయవాడ–బిట్రగుంట (07978), విజయవాడ–గూడూరు (07500), ఒంగోలు–విజయవాడ (07576) రైళ్లు రద్దు చేసిన అధికారులు.. ఇక,10, 11 తేదీల్లో గూడూరు–విజయవాడ (07458), 10న కాకినాడ పోర్టు–విశాఖపట్నం (17267), విశాఖపట్నం–కాకినాడ పోర్టు (17268), విజయవాడ–ఒంగోలు (07461), విజయవాడ–గుంటూరు (07783), బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237), చెన్నై సెంట్రల్–బిట్రగుంట (17238) రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు.. మరోవైపు.. కాకినాడ పోర్టు–విజయవాడ (17258) రైలును ఈ నెల 10న కాకినాడ పోర్టు–రాజమండ్రి మధ్య, విజయవాడ–కాకినాడ పోర్టు (17257) రైలు గురువారం రద్దు చేయగా.. ఇవాళ రాజమండ్రి–కాకినాడ పోర్టు మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు రైల్వేశాఖ అధికారులు.
Read Also: Amih Shah: నేడే హైదరాబాద్ కు కేంద్ర మంత్రి అమిత్ షా రాక