దేశంలో రైల్వే ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఈ మేరకు భారతీయ రైల్వే సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కవచ్ కార్యక్రమాన్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని చేపట్టింది. భద్రత, దాని సామర్థ్యం పెంపు కోసం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ప్రపంచ స్థాయి టెక్నాలజీ కవచ్ అందుబాటులోకి రావడం వల్ల రైల్వే ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు ఆశిస్తున్నారు. ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినా అవి ఢీకొట్టుకునే అవకాశాలు ఉండవని చెప్తున్నారు.…
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాద సంఘటన స్థలాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైలు ప్రమాద ఘటనపై చట్టబద్ధమైన విచారణ ప్రారంభించామన్నారు. అంతేకాకుండా ప్రధాని మోడీ పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. రైలు ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడి ప్రార్థిస్తున్నానన్నారు. అయితే నిన్న సాయంత్రం రైలు పట్టాలు తప్పి 7గురు మృతి చెందిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. గౌహతి-బికనీర్ ఎక్స్‌ప్రెస్ జలపైగురి జిల్లాలోని…