Sankranti 2023: హైదరాబాద్ నగరం నిర్మానుష్యంగా మారింది. సంక్రాంతి పండుగను పల్లెల్లో జరుపుకోవడానికి సొంత గ్రామాలకు లక్షలాది మంది తరలివెళ్లడంతో… జనారణ్యం బోసిపోయింది. ప్రజలు నగరాల నుంచి పల్లె బాట పట్టడంతో… ఆయా హైవేల్లోని టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు కిటకిటలాడాయి. సొంత వాహనాల్లో సొంతూర్లకు వెళ్తుండటంతో…. టోల్ గేట్ల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడ జాతీయ రహదారిలో పతంగి, కొర్లపహాడ్ టోల్‌గేట్ల దగ్గర వాహనాలు బారులు తీరాయి. పతంగి టోల్‌గేట్ వద్ద వాహనాలు…