కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ లఖింపూర్‌ఖేరిలో నిరసన తెలుపుతున్న రైతులను ఓ కారు ఢీ కొట్టింది. ఆ ఘటనలో కొంత మంది రైతులు మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కారును నడిపింది హోం శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కొడుకేనంటూ ఆరోపణలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై సిట్ విచారణ జరిపి ఆ ఘటన కుట్రపూరితంగానే జరిగిందని వెల్లడించింది.…