Rahul Gandhi: రాహుల్ గాంధీ గత పదేళ్ల కాలంగా ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్ పార్టీకి, 2024లో ప్రతిపక్ష హోదా తీసుకువచ్చాడనే ఖ్యాతి కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. ప్రస్తుతం ఆయన లోక్‌సభలోప్రతిపక్ష నాయకుడిగా (LoP)ఉన్నారు. అయితే, ఆయన ప్రతిపక్ష నేతగా మారిన తర్వాత తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లారు. నిజానికి భారత అంతర్గత విషయాలను ఎలాంటి రాజకీయ వైరం ఉన్నప్పటికీ విదేశీ గడ్డపై మాట్లాడటం అంత సబబు కాదు. కానీ ప్రస్తుతం రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు,…
Rahul Gandhi: అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు ఇంటాబయట వివాదాస్పదమవుతున్నాయి. సిక్కులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే బీజేపీ తీవ్రంగా విరుచుకుపడుతోంది. మరోవైపు రిజర్వేషన్ల రద్దు వ్యాఖ్యలు కూడా దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా అమెరికా చట్టసభ సభ్యురాలు, భారత వ్యతిరేకి, పాకిస్తాన్ మద్దతురాలిగా పేరున్న ఇల్హాన్ ఒమర్‌తో రాహుల్ గాంధీ భేటీ కావడంపై కూడా విమర్శలు వస్తున్నాయి.