లడఖ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. సోమవారం ఖర్దుంగ్లా పాస్‌ను సందర్శించారు. అంతేకాకుండా తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పాంగాంగ్ సరస్సు వద్ద నివాళులర్పించారు. ఖర్దుంగ్లా ప్రాంతానికి రాహుల్ గాంధీ బైక్ పై వెళ్లారు.
Rahul Gandhi: మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నివాళులర్పించారు. లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్ద రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్‌గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. గత 4 రోజులుగా లడఖ్‌లో పర్యటిస్తున్న రాహుల్ పాంగాంగ్ సరస్సు వద్ద రాజీవ్‌గాంధీకి నివాళులర్పించారు. ఆదివారం ఆయనకు లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్ద నివాళులు అర్పించిన రాహుల్ ‘‘మా నాన్న (రాజీవ్) చాలా సంవత్సరాల క్రితం ఇక్కడకు వచ్చారు.…
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మార్పుపై గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై తాజాగా జగ్గారెడ్డి స్పందించారు. గత ఏడాదిన్నర నుంచి సోషల్ మీడియా ఆనందం ఏందో మరి అర్థం కావడం లేదు.. ఎవరు చేయిస్తున్నారు.. ఎందుకు రాస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యనించారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ చేసిన వ్యాఖ్యలు.. దేశంలో లోక్‌సభ ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయంపై కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం (ఆచార్య ప్రమోద్) స్పందించారు. ప్రియాంక గాంధీని ప్రధాని అభ్యర్థిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆగస్టు 20న తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలను జరుపుకోనున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్దకు బైక్‌పై వెళ్లారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వర్షాకాల పార్లమెంటు సమావేశాల అనంతరం వివిధ రాష్ట్రాల పర్యటనలు చేపడుతున్నారు. ఇప్పటికే రాజస్థాన్‌లో పర్యటను ముగించుకున్న రాహుల్ గాంధీ.. శుక్రవారం జమ్ము కాశ్మీర్ లడఖ్‌లో పర్యటించారు.
పెరుగుతున్న ఆహార పదార్థాల ధరలతో కష్టాల్లో కూరుకుపోయిన కూరగాయల వ్యాపారికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన చేతులతో భోజనం వడ్డించారు. ఇటీవల ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండీలో పెద్దసంఖ్యలో టమాటాలు కొనేందుకు వచ్చిన రామేశ్వర్... అక్కడి ధరలు చూసి టమాటాలు కొనలేకపోయాడు. టమాటాల ధరలు చూసి అతడు కన్నీటి పర్యంతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మళ్లీ అమేథీ నుంచి పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్తగా నియమించబడిన అధ్యక్షుడు అజయ్ రాయ్ శుక్రవారం ధృవీకరించారు.
నరేంద్ర మోడీ, కేసీఆర్, రాహుల్ గాంధీని ఢీ కొట్టే శక్తి కేఏ పాల్ కే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కవితని ఈడీ అరెస్ట్ చేయకపోతే బీజేపీ 40 సీట్లు గెలుస్తుంది అని చెప్పాను.. ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం ఉందని పాల్ అన్నారు. కేసీఆర్ మంత్రి వర్గంలో ఉన్న చాలా మంది మంత్రులు నాతో టచ్ లో ఉన్నారు.