Rahul Gandhi: ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో సూట్ కేసులు మోసిన రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేడు ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు. ఇక్కడి రైల్వే స్టేషన్‌లో పనిచేస్తున్న కూలీలను ఆయన కలిశారు. వారితో మాట్లాడి పనిలో పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. దాని పరిష్కారంపై వారి అభిప్రాయాన్ని తీసుకున్నారు. గత నెలలో కాంగ్రెస్ నాయకుడిని కలవాలని కూలీలు తమ కోరికను వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన తర్వాత, రాహుల్ వారిని కలవాలని ప్లాన్ చేసినట్లు భావిస్తున్నారు. రైల్వే స్టేషన్‌లో కాంగ్రెస్ నేతలు కూడా లగేజీలు ఎత్తుకోవడం కనిపించింది. రైల్వే స్టేషన్‌లో ఎర్రటి పోర్టర్ యూనిఫాంలో రాహుల్ కనిపించాడు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని కలిసే సమయంలో ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ ఇక్కడ ఆటో డ్రైవర్లు, కూలీలను కలవడం చాలా సంతోషంగా ఉంది. మా సమస్యలను ప్రభుత్వం ముందు నివేదిస్తానని చెప్పారు. మా అభిప్రాయాలను ప్రభుత్వం ముందు ఉంచుతానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాహుల్ హామీ ఇచ్చారని ఆ వ్యక్తి చెప్పాడు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Read Also:Khalistani Terrorist: కెనడాలో మరో ఖలిస్థానీ సానుభూతిపరుడి హత్య.. భారత్‌లో పలు క్రిమినల్ కేసులు!
VIDEO | Congress leader Rahul Gandhi meets railway porters at Anand Vihar Railway Station in Delhi, wears porter dress and badge. pic.twitter.com/wYqOGOmB2v
— Press Trust of India (@PTI_News) September 21, 2023
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ యాత్రలో భాగంగా ఆయన ఈరోజు ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు. గత నెలలో కూలీలు రాహుల్ గాంధీని కలుసుకుని తమ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటున్నట్లు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
Read Also:Chandrayaan-3 : ‘చంద్రయాన్’ కోసం పనిచేసిన వాళ్లు జీతం లేక ఉదయం టీ అమ్ముకుంటున్నారు : జేఎంఎం ఎంపీ
EXCLUSIVE:
Rahul Gandhi lifts the luggage in the dress of a coolie at Anand Vihar station.
Last month, these coolies demanded to meet Rahul Gandhi.
In just 36 days, their wish came true just with a viral video.
Rahul Gandhi is hitting BJP on their propaganda machinery by… pic.twitter.com/8LnbQ6uIMU
— Amock (@Politics_2022_) September 21, 2023
గతంలో కూడా కూలీలతో కాంగ్రెస్ నేత సమావేశమయ్యారు. గతేడాది ఉదయ్‌పూర్‌లోని కాంగ్రెస్ చింతన్ శివిర్‌కు వెళ్లి కూలీ సంఘం సభ్యులను కలిశారు. ప్రతిరోజు ఆయన సామాన్య ప్రజలను కలుసుకోవడం కనిపిస్తుంది. ఇటీవల ఆయన తన ఇంటికి కూరగాయలు అమ్మే వ్యక్తిని, అతని భార్యను ఆహ్వానించాడు. వారితో కలిసి భోజనం చేసి మాట్లాడారు.
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!