Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనారోగ్యం పాలయ్యారు. తేలికపాటి జ్వరం లక్షణాలతో ఆస్పత్రిలో ఢిల్లీలోని సర్ గంగారమ్ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు వైద్యులు పరీక్షలు జరిపారు, ప్రస్తుతం ఆరోగ్యం స్థిరంగా ఉందని తెలిపారు.
(INDIA) కూటమి అధికారంలోకి వస్తే ఎల్పిజి సిలిండర్లను రూ. 500 తక్కువ ధరకు అందజేస్తామని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు.
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన 'రాజీవ్ యువ మితాన్ క్లబ్' కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ నడ్డివిరిచిందని అన్నారు. బీజేపీ, నరేంద్ర మోడీ భారతదేశంలోని ఇద్దరు, ముగ్గురు బిలియనీర్ల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ టార్గెట్ చేశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చైనా సంస్థల ప్రతినిధిగా మారారా అని రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం ప్రశ్నించారు.
ప్రతిపక్షాలు ఏకమైతే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం అసాధ్యమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ముంబైలో రెండు రోజుల పాటు జరిగిన ఇండియా కూటమి సమావేశం అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.
OCCRP Allegations on Adani Group : అదానీ గ్రూప్ పై మరోసారి పిడుగుపడింది. మళ్లీ ఆ సంస్థపై అక్రమ పెట్టుబడులు ఆరోపణలు ఊపందుకున్నాయి. ఈసారి ఈ ఆరోపణలు చేసింది ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్(ఓసీసీఆర్పీ). అదానీ గ్రూప్ కంపెనీల్లో అజ్ఞాత విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని ఓసీసీఆర్పీ సంచలన ఆరోపణలు చేస్తోంది. యాక్టివ్ గా లేని మారిషస్ ఫండ్స్ ద్వారా కోట్లాది డాలర్లను గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు పేర్కొంది. దీని ద్వారా…
Sonia Gandhi: ముంబై వేదికగా ఈ రోజు, రేపు జరగబోయే ఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీతో పాటు ఎంపీ రాహుల్ గాంధీ ఇద్దరూ హజరుకానున్నారు. వీరు ఇప్పటికే ముంబై చేరుకున్నారు. వీరికి ఆహ్వానం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా ఎయిర్ పోర్టు ముందు గుమిగూడారు.
Opposition Parties: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈరోజు అంటే గురువారం (ఆగస్టు 31) 2 రోజుల ఇండియా కూటమి సమావేశం జరగనుంది. సాయంత్రం 6.30 గంటలకు అనధికారిక సమావేశం జరగనుంది. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు ఉద్ధవ్ ఠాక్రే విందు ఇవ్వనున్నారు.