కామారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారు.. కాళేశ్వరం కట్టిన మూడేళ్లలో మేడిగడ్డ కుంగిందని తెలిపారు. అంతేకాకుండా.. ధరణి పేరుతో వేల ఎకరాలు కేసీఆరే ఆక్రమించుకున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో 8లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. ప్రశ్నపత్రాల లీకేజీలతో నిరుద్యోగుల ఉసురు తీస్తున్నారని ఆగ్రహం…
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి కాంగ్రెస్ రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓవైసీ, ప్రధాని నరేంద్రమోడీకి స్నేహితుడని వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఓవైసీ స్పందించారు. రాహుల్ గాంధీ జీవితంలో రెండు ప్రేమలు ఉన్నాయని, ఒకటి ఇటలీ అయితే మరొకరు ప్రధాని నరేంద్రమోడీ అని అన్నారు.
జగ్గారెడ్డిని గెలిపిస్తున్నారా లేదా అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటర్లను అడిగారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారసభలో రాహుల్ ప్రసంగించారు. దొరల తెలంగాణకి, ప్రజల తెలంగాణ కి మధ్య పోరాటం ఇది అంటూ ఆయన అన్నారు. కేసీఆర్ ప్రజల భూములు లాక్కుంటున్నారని.. వందల కోట్లు దోచుకుంటున్నారని, కాళేశ్వరం పేరుతో ప్రజల సొమ్ము దోచుకున్నారని ఆయన ఆరోపించారు.
Rahul Gandhi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. తెలంగాణ కోసం ఒకరి తర్వాత ఒకరు జాతీయ నాయకుల క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇవాళ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
Rahul Gandhi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. నాలుగు రోజుల్లో ఎన్నికల ఓటింగ్ జరగనుంది. దీంతో పాటు గెలుపే ధ్యేయంగా అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.
ఆలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ రోడ్ షోలో మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. ‘బీఆర్ఎస్ సభలల్లో జన సునామీ కనిపిస్తుంది. కాంగ్రెస్ వాళ్ల మీటింగ్లకు మాత్రం జనాలు రావడం లేదు. 80 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలు అన్నదాతలకు కష్టాలు. రేవంత్ 3 గంటలు కరంట్ చాలు అంటున్నాడు. కర్ణాటక DY సీఎం శివ కుమార్ 5 గంటలు కరంట్ ఇస్తాం అని కుండ బద్దలు కొట్టాడు. Also Read: Teen…
Rahul Gandhi Comments: సాధించుకున్న తెలంగాణలో ప్రజల సంపూర్ణ కల సహకారం కాలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. శనివారం రాహుల్ గాంధీ వేములవాడలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంది. మీ కలలు కూడా సహకారం చేసింది మేమే. కంప్యూటర్ నమోదు పేరుతో భూములన్ని ధరణిలో నమోదు చేస్తూనే.. 24 గంటలు భూములను ఎలా లాక్కోవాలని కేసీఆర్ చూస్తున్నారు’ అని…
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో జోరు పెంచారు. అందులో భాగంగా.. ఆదిలాబాద్ లోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో కాంగ్రెస్ ప్రజా విజయభేరి సభలో అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో దొరల పాలన కొనసాగుతోందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుధ్ధంగా కేసీఆర్ పాలన ఉందని విమర్శించారు. ప్రజలు కన్న కలలు నెరవేరటంలేదు.. అమరుల ఆశయాలు నెరవేరట్లేదని ఆరోపించారు.
Rahul Gandhi: క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు ఓటమికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ అని.. అతను ఓ పనౌటి అంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. దీనిపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.