కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విటర్ మాధ్యమంగా సెటైర్స్ వేశారు. ‘‘పొలిటికల్ టూరిస్టులు రావొచ్చు, వెళ్ళొచ్చు. ఒక్క కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణలో ఉంటారు’’ అంటూ తనదైన శైలిలో పంచ్ వేశారు. అంతేకాదు, ఆ డైలాగ్‌కి తగ్గ ఉన్న మేనరిజం ఫోటోను కూడా షేర్ చేశారు. అయితే, ఆ వెంటనే రేవంత్ రెడ్డి కూడా ఆయనకు కౌంటర్ వేశారు. ‘‘కేటీఆర్ గారు.. మీ దృష్టిలో తెలంగాణ ఒక టూరిస్ట్ ప్లేస్…
రాహుల్ గాంధీ పర్యటన పై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. గౌరవ రాహుల్ గాంధీ గారు, మీరు కానీ మీ పార్టీ కానీ ఎన్ని సార్లు పార్లమెంట్ లో తెలంగాణ అంశాలను, హక్కులను ప్రస్తావించారో చెప్పండి.? తెలంగాణ రాష్ట్ర హక్కులకోసం టిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు ? దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా,…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన మినెట్ టూ మినెట్ షెడ్యూల్ విడుదలైంది. సాయంత్రం 4:50కి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రాహుల్ గాంధీ చేరుకుంటారు. 5:10కి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా వరంగల్ బయలుదేరుతారు.. 5:45కు వరంగల్ గాబ్రియెల్ స్కూల్ కు చేరుకుంటారు.. 6:05 వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో…