ట్రంప్‌ను చూసి ప్రధాని మోడీ భయపడుతున్నారంటూ కాంగ్రస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యల్ని అమెరికా గాయని మేరీ మిల్బెన్ ఖండించారు. రాహుల్ గాంధీకి భారత ప్రధాని అయ్యే చతురత లేదని ఆమె విమర్శించారు. ట్రంప్‌కు మోడీ భయపడరని.. అమెరికాతో భారత దౌత్యం వ్యూహాత్మకమైందని రాసుకొచ్చారు.
Rahul Gandhi Comments: సాధించుకున్న తెలంగాణలో ప్రజల సంపూర్ణ కల సహకారం కాలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. శనివారం రాహుల్ గాంధీ వేములవాడలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంది. మీ కలలు కూడా సహకారం చేసింది మేమే. కంప్యూటర్ నమోదు పేరుతో భూములన్ని ధరణిలో నమోదు చేస్తూనే.. 24 గంటలు భూములను ఎలా లాక్కోవాలని కేసీఆర్ చూస్తున్నారు’ అని…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ ఈరోజు తాను పార్టీ అధినేత పదవికి దూరంగా లేనని సూచించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు. అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగినప్పుడు (కాంగ్రెస్) అధ్యక్షుడిని అవుతానా లేదా అనేది స్పష్టమవుతుందన్నారు.
పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది. ఎనిమిదేళ్లలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని చంపేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. దేశంలో వ్యక్తులు నియంతల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిత్యావసర వస్తువల ధరలు విపరీతంగా పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.