Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయాణించే హెలికాప్టర్ టేకాఫ్ ఆలస్యం కావడం వివాదాస్పదంగా మారింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC) నుండి క్లియరెన్స్ రాకపోవడంతో హెలికాప్టర్ టేకాఫ్ ఆలస్యం అయింది. జార్ఖండ్‌లోని గొడ్డాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఊహించని విధంగా ఈ ఆలస్యాన్ని ఎదుర్కొన్నారు.