రేషన్ లబ్ధిదారులకు మార్చి 1 నుంచి రాగిపిండిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కిలో ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయనుంది. రాగిపిండి ధర బహిరంగ మార్కెట్ లో కేజీకి రూ.40పైనే పలుకుతుండగా, ప్రభుత్వం రూ.11కే ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఒక్కో కార్డుకు ఇస్తున్న బియ్యంలో కిలో బియ్యం బదులు రాగులు/జొన్నలు ఇస్తున్న సంగతి తెలిసిందే. రాగి పిండిని ముందుగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నంలో…