CMD Raghumareddy: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి సూచించారు.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి, సంస్థ పరిధిలోని చీఫ్ జనరల్ మేనేజర్, సూపెరింటెండింగ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు.