దీర్ఘకాలిక తుంటిగాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలగుతున్నట్లు రాఫెల్ నాదల్ గురువారం ప్రకటించారు. కెరీర్‌కు సంబంధించి స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ సంచలన ప్రకటన చేశాడు. 2024 తన కెరీర్‌లో చివరి సీజన్ అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. అంతేగాక గాయాలు వెంటాడుతుండడంతో ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగడం లేదన్నాడు.