యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “రాధే శ్యామ్”. డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ అండ్ లవ్ పాన్ ఇండియా మూవీ. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడుతోంది. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా 2022 జనవరి 14న థియేటర్లలో విడుదల కానుందని “రాధే శ్యామ్” బృందం ప్రకటించింది.…