ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ ఈనెల 11న విడుదల కానుంది. మాస్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ క్లాస్ టచ్ తో ‘రాధే శ్యామ్’ చేయటం నిజంగా రిస్క్ అనే అనుకోవాలి. గతంలో కూడా తెలుగులో పలు ప్రేమ కథా చిత్రాలు చేశాడు ప్రభాస్. ‘వర్షం, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్’ వంటివి ఆ కోవకే చెందుతాయి. అయితే పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత ప్రేమకథా చిత్రం చేయటం మాత్రం ముమ్మాటికి హై రిస్క్ అనే అనుకోవాలి.…