హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో శ్రీరామానుజచార్యుల సహస్రాబ్ధి సమారోహం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు రథసప్తమి సందర్భంగా ఏడోరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దుష్టగ్రహ బాధల నివారణ కోసం యాగశాలలో శ్రీ నారసింహ ఇష్టి కార్యక్రమం నిర్వహించనున్నారు. అటు సర్వవిధ పాప నివారణ కోసం శ్రీమన్నారాయణ ఇష్టి, లక్ష్మీనారాయణ మహాక్రతువు, చతుర్వేద పారాయణం చేపట్టనున్నారు. ప్రవచన మండపంలో శ్రీనారసింహ అష్టోత్తర శతనామావళి పూజతో పాటు సామూహిక ఆదిత్య పారాయణం సహా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. Read Also: మార్చి…
కరోనా మహమ్మారి కారణంగా గతంలో తిరుమలకు వెళ్ళే భక్తుల సంఖ్య తగ్గింది. ఇటీవల కాలంలో భక్తులు పెరుగుతున్నారు. ప్రతిరోజూ కలియుగ వైకుంఠం తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమేపీ పెరగడంతో ఆదాయం కూడా భారీగానే వస్తోంది. తాజాగా శుక్రవారం తిరుమల శ్రీవారిని 28, 410 మంది దర్శించుకున్నారు. 14,813 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల రాకవల్ల టీటీడీకి రూ.2.08 కోట్ల ఆదాయం లభించింది. 8వ తేదిన రథసప్తమి వేడుకలను ఏకాంతంగా నిర్వహించనుంది టీటీడీ.…