కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు రాజుకుంటూనే వున్నాయి. అనుచరుడిగా ఉంటారని ఆ ఎమ్మెల్యే కోరి తెచ్చుకున్న వ్యక్తి ఆయనకే కొరగాని కొయ్యగా మారిపోయాడు. మారిన పరిణామాలతో ఆ అనుచరుడికి ఊహించని పదవి వచ్చింది. దీంతో అధికారపార్టీలో వర్గవిభేదాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. అధిష్ఠానానికి తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. రాచమల్లు, రమేష్ మధ్య మలుపులు తిరుగుతున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ ఆవిర్భావంతో లోకల్ పాలిటిక్స్ మారిపోయాయి. అప్పటిదాకా పోటీ టీడీపీ, కాంగ్రెస్…