అక్టోబరు 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తాను అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. అక్టోబరు 10 నుంచి నవంబర్ 22వరకూ రచ్చబండ కార్యక్రమం ఉంటుందని, మెడికల్ కాలేజీల ప్రైవటీకరణపై కరపత్రాలు పంపిణీ చేస్తామని చెప్పారు. కోటి సంతకాలను రచ్చబండ కార్యక్రమాల ద్వారా సేకరిస్తామని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కనీసం ప్రతి పంచాయతీ నుంచి 500 మందితో సంతకాలు సేకరిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గ సమన్వయ కర్త ప్రతిరోజూ రెండు గ్రామాలను సందర్శిస్తాడని,…