ఇండియా మోటార్ స్పోర్ట్స్ రేసింగ్ హిస్టరీలో సరికొత్త అధ్యాయానికి హైదరాబాద్ వేదిక అయింది. దేశంలో తొలి స్ర్టీట్ సర్క్యూట్ రేసుకు మన మహానగరం సిద్ధమైంది. నేడు రేపు హుస్సేన్ సాగర్ లేక్‌లో భారతదేశానికి చెందిన స్ట్రీట్ సర్క్యూట్ రేసుల ప్రారంభ ఎడిషన్ ‘ఇండియన్ రేసింగ్ లీగ్’ మొదటి రేసును హైదరాబాద్ నగరం నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది.