(ఆగస్టు 21న నటి రాధిక పుట్టినరోజు) చిలిపితనం, చలాకీతనం కలబోసిన రూపంతో రాధిక అనేక చిత్రాల్లో తనదైన బాణీ పలికించారు. ఇప్పుడంటే అమ్మ పాత్రల్లో అలరిస్తున్నారు కానీ, ఒకప్పుడు రాధిక అందం, అభినయం జనాన్ని కట్టిపడేశాయి. ఇక డాన్సుల్లోనూ ఆమె స్పీడును చూసి జనం అబ్బో అన్నారు. కొందరు ఆమె సరసన చిందులు వేయడం చేతకాక బొబ్బలు పెట్టారు. ‘న్యాయం కావాలి’ చిత్రంతో తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టిన రాధిక నాయికగా పలు చిత్రాలతో జైత్రయాత్ర చూశారు.…