ఆర్టిస్టుల్ని చూపించకుండా కేవలం కథ, కథనాల మీదే నడిచే సినిమా ‘రా రాజా’. అసలు మొహాలు చూపించకుండా సినిమాను తీయడం అనేది సాహసం కాదు ఒక రకమైన ప్రయోగమే అని చెప్పాలి. ఇలాంటి ప్రయత్నం చేసి మెప్పించేందుకు రెడీ అయింది ‘రా రాజా’ టీం. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ తెరకెక్కించిన ‘రా రాజా’ నుంచి తాజాగా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్‌ను తమ్మారెడ్డి భరద్వాజ్ వీక్షించి అభినందించారు.…