సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘స్కైలాబ్’. ఈ చిత్రానికి హీరోయిన్ నిత్యామీనన్ కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం. 1979లో సాగే ఈ పీరియాడిక్ మూవీని విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ గురించి దర్శక నిర్మాతలు చెబుతూ, ”బండ లింగపల్లిలో ఓ ధనవంతురాలి బిడ్డ గౌరి. జర్నలిస్ట్ కావాలనే కోరికతో ప్రతిబింబం అనే పత్రికకు వార్తలు సేకరించి పంపుతూ ఉంటుంది. డాక్టర్ ఆనంద్ తన గ్రామంలో…