వెలగపూడిలోని సెక్రటేరియట్‌లో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. పలు అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. ఈ క్రమంలోనే రాజధాని పరిధిలోని ఆర్-5 జోన్‌లో పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
అమరావతిలో ఇతర ప్రాంతాల పేదలకు కూడా ఇళ్లు కేటాయించేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం కొత్తగా ఆర్-5 జోన్ ను సృష్టించడం తెలిసిందే. దీన్ని అమరావతి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై హైకోర్టులో నిన్న వాదనలు పూర్తయ్యాయి. ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ లో ఉంచింది. అయితే.. ఈ నేపథ్యంలో.. అమరావతి ఆర్ 5 జోన్ లో ఇళ్ళ నిర్మాణాల కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. breaking news,…
రాజధానిలో పేదలకు ఇళ్లిచ్చే అద్భుతమైన కార్యక్రమం దేశ చరిత్రలోనే ప్రత్యేకమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దేశంలో పేదలకు ఇల్లు కావాలని అనేక పోరాటాలు చూశామన్నారు. కానీ పేదలకు ఇల్లు ఇవ్వడానికి సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సి వచ్చిందని.. యాభై వేల మందికి ఇల్లు ఇస్తామంటే మారీచులు ,రాక్షసులు లాంటి ప్రతిపక్షాలు అడ్డు పడ్డాయని ఆయన మండిపడ్డారు.
ఏపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమరావతి ప్రాంతంలో.. పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కాసేపట్లో రాజధాని అమరావతి ప్రాంతంలో పేద ప్రజల సొంతింటి కల నెరవేరనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేడు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు.
R5 Zone Layouts: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి రాజధాని ప్రాంతంలో పేదల ఇళ్ళ పట్టాల పంపిణీ సాకారం కానుంది. కోర్టు కేసులు కొలిక్కి రావటం, అమరావతి రైతుల వ్యతిరేకత మధ్య ఆర్ 5 జోన్ లో ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన రెడ్డి ఈ నెల 26వ తేదీన లబ్దిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 50…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన వాలంటీర్లకు వందన కార్యక్రమంలో రోజా పాల్గొని ప్రసంగించారు. పేదలకు ఇచ్చే సెంటు స్థలాన్ని చంద్రబాబు సమాధులతో పోల్చడాన్ని ఆమె తప్పుబట్టారు.
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. అమరావతిలో పేదలకు ఇంటి స్థలాల కేటాయింపు వ్యవహారం కొంత కాలంగా న్యాయపరమైన వివాదంగా మారింది. ఆర్ 5 జోన్ ఏర్పాటు పైన స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.