తాను డబ్బులు తీసుకొని ఏ ఒక్క ప్రెస్‌మీట్ పెట్టలేదని వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి పేర్కొన్నారు. కావాలంటే నార్కో టెస్ట్ నిర్వహించండి అంటూ ఆయన సవాల్ విసిరారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ అవ్వకముందు నుంచే ప్రెస్‌మీట్‌లు పెట్టానన్నారు. గత 15 ఏళ్లుగా ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నానన్నారు. పెయిడ్‌గా ఒక్క ప్రెస్‌మీట్ పెట్టినా వేరే దేశానికి వెళ్లిపోతానన్నారు.
ఈరోజు ఎన్టీవీ నిర్వహించిన క్వశ్చన్ అవర్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తాను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎంతో సేవ చేశానని తెలిపారు. ఎన్నికల్లో ఎవరో చెబితో ప్రజలు ఓట్లు వేయరు.. వారికి జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓటేస్తారన్నారు. అది ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి ఎంతో చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు…
బీఆర్‌ఎస్ పార్టీని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదని, తెలంగాణ ప్రజలు అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఇక సాధ్యం కాదన్నారు. సెంటిమెంటు మీద ఆధారపడి ఎల్లకాలం రాజకీయాలు నడవవన్నారు. 2015లోనే ఫోన్ ట్యాపింగ్‌పై చర్చ జరిగిందన్నారు.
మల్కాజిగిరికి ఈటల సరిపోతారని హైకమాండ్ టికెట్ ఇచ్చిందని, బీజేపీ సోషల్ ఇంజినీరింగ్‌లో నెంబర్‌వన్ అని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ సారి మోడీని ప్రధానిని చేయాలన్న భావన ప్రజల్లో కనిపిస్తోందన్నారు.
ఏ నగరమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడ వాతావరణం బాగుండాలి.. ఖమ్మంలో ఆ పరిస్థితి లేదని, తాను మంత్రివర్గం నుంచి తప్పుకున్నాక పరిస్థితులు మారాయని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుతో ఎన్టీవీ క్వశ్చన్ అవర్‌లో పాల్గొన్నారు.