Stock Selection: స్టాక్ మార్కెట్‌లో షేర్లను కొనే ముందు కంపెనీల అనాలసిస్ చేయాలి. దీనికి రెండు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. 1. క్వాలిటేటివ్ 2. క్వాంటిటేటివ్. క్వాలిటేటివ్ అనాలసిస్‌లో అసలు ఆ కంపెనీ బిజినెస్ మోడల్, బలాలు, బలహీనతలు, అవకాశాలు తదితరాలను పట్టించుకోవాలి. కంపెనీకి ఏయే సెగ్మెంట్లలో రెవెన్యూ వస్తోందో, ఏయే సెగ్మెంట్లు ఇంప్రూవ్ అవుతున్నాయో చూడాలి. తర్వాత.. ప్రమోటర్స్ బ్యాంక్‌గ్రౌండ్ మరియు కార్పొరేట్ గవర్నెన్స్‌ను విశ్లేషించుకోవాలి.