వచ్చే సంవత్సరం వెస్టిండీస్–అమెరికాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు పపువా న్యూ గినియా అర్హత సాధించింది. ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయర్స్ నుంచి పపువా న్యూ గినియా టీమ్ టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన జట్టుగా నిలిచింది. ఇవాళ (శుక్రవారం) ఎమిని పార్క్ వేదికగా పిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పపువా న్యూ గినియా వంద రన్స్ తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.