క్యూ నెట్ మల్టిలెవల్ మార్కెటింగ్ పేరుతో మోసం చేస్తున్నారు అని హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. పీరమిడ్ స్కీమ్ పేరుతో బోగస్ కంపనీ తో అమాయకులను టార్గెట్ చేశారన్నారు.
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనలో దుర్మార్గపు సంస్థ Qనెట్ పాత్రపై సమగ్ర విచారణ జరపాలని ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ కోరారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.