తెలంగాణలో యూట్యూబ్ ఛానెళ్ళు లెక్కకు మిక్కిలిగా పెరిగిపోయాయి. వాటిపై నియంత్రణ కూడా వుండడం లేదు. దీంతో యూట్యూబ్ వార్తా చానెళ్లకు ముకుతాడు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగిస్తోంది. యూట్యూబ్ చానెళ్లు చేస్తున్న అభ్యంతరకర ప్రసారాలపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అసత్య, విద్వేషపూరిత వార్తలు ప్రసారాలు చేయడం, మతాలు, కులాల మనోభావాలను దెబ్బతీయడం వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం వుంది. రాజకీయంగా కొందరిని టార్గెట్ చేసుకుని కామెంట్లు, పోల్స్ పెట్టి వ్యక్తిగత, కుటుంబ…