పైరసీ భూతం టాలీవుడ్ ను ఎన్నో ఏళ్లుగా వెంటాడుతూనే ఉంది. గతంలో సినిమా రిలీజ్ రోజు ఎక్కడో మారుమూల ఓ సెంటర్ లో సీక్రెట్ కెమెరాలతో రికార్డ్ చేసీ థియేటర్ ప్రింట్ ను రిలీజ్ చేసి సొమ్ము చేసుకొనేవారు. అర్జున్, అత్తారింటికి దారేది లాంటి మరికొన్ని సినిమాలయితే థియేటర్ కంటే ముందుగా కూడా పైరసీ రూపంలో బయటకు వచ్చేసాయి. ఎన్ని చర్యలు తీసుకున్న సరే పైరసీకి అడ్డుకట్ట వేయలేకపోయారు. ఇప్పడు సినిమా స్థాయి పెరగడం, పాన్ వరల్డ్…