పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకుడు.. కానీ, ఆయన సేవలకు తగిన గౌరవం లభించలేదన్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు… మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి సందర్భంగా నివాళులర్పించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీవీని బహుముఖ ప్రజ్ఞాశాలిగా అభివర్ణించారు.. మాతృభాష పట్ల ఆయనకున్న ప్రేమను గుర్తు చేసుకున్నారు.. ఏ దేశం అయినా సంస్కృతి, వారసత్వం, గొప్ప నాయకుల సేవలను మరచిపోయి ముందుకు సాగలేదన్నారు.. విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకత్వం వహించిన క్రాంతదర్శిగా పీవీని అభివర్ణించిన…