ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేశారు. సోమవారం నాడు ట్రంప్-జెలెన్‌స్కీ సమావేశానికి కొన్ని గంటల ముందు పుతిన్ ఫోన్ కాల్ చేశారు. ఈ సందర్భంగా ఆగస్టు 15న అలాస్కా వేదికగా ట్రంప్‌తో జరిగిన సంభాషణను మోడీతో పంచుకున్నారు.
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ముగింపునకు గత కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. సౌదీ అరేబియా వేదికగా అమెరికా అధికారులు-రష్యాతో చర్చలు జరుపుతున్నారు. మూడేళ్ల నుంచి జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని రష్యాను అమెరికా కోరింది. దీనికి ఉక్రెయిన్ సానుకూల సంకేతాలు ఇవ్వగా.. రష్యా నుంచి మాత్రం స్పష్టమైన సమాధానం రాలేదు.