ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన “పుష్ప: ది రైజ్” సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సినిమా కంటే సినిమాలో స్టార్ హీరో అల్లు అర్జున్ మ్యానరిజమ్, డైలాగ్స్ సినీ ప్రియులను, అభిమానులను, అలాగే సెలెబ్రిటీలను సైతం విశేషంగా ఆకట్టుకున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షోకి సిద్ధమైంది. తాజాగా ‘పుష్ప’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ లకు సంబంధించిన అప్డేట్ ను ఇచ్చారు…