ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప-2’ రికార్డు స్థాయి వసూళ్లుతో దూసుకెళుతోంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని టార్గెట్ తో బరిలో దిగిన పుష్ప రాజ్ ఆ రికార్డును కేవలం తొమ్మిది రోజుల్లోనే సాధించి రెండువేల కోట్ల వైపు పరుగులు పెడుతోంది.